Wednesday, January 22, 2025

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

- Advertisement -
- Advertisement -

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్


మన తెలంగాణ/సదాశివనగర్ : బాదపడుతు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శనివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురెందర్ పరామర్షించారు. మండలంలోని కుప్రియాల్ గ్రామానికి చెందిన కావేరి భాస్కర్ ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం ఇప్పటి వ రకు సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాడు. ప్రస్థుతం అతను నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాడన్న సమాచారం స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు ద్వా రా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి పలకరించారు. అతనికి మెరుగైన వై ధ్యం అంధించి త్వరగా కోలుకునే విధంగా చూడాలని వైధ్యులకు సూచించా రు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మీకు అండగా ఉటుందని అధైర్య పడొద్దని కుటుంబ సభ్యులకు మనో ధైర్యానిచ్చారు. ఆయన వెంట టిఆర్‌ఎస్ రైతు విభాగం మాజి రాష్ట్ర ఉపాద్యక్షుడు గాధారి అశోక్ రెడ్డి, ఎంపిటిసీల ఫోరం అద్యక్షుడు పాపనో ల్ల బీరయ్య, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు యండి. అల్తాఫ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగిని పెద్ద నర్సయ్య,నారాయణ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News