Thursday, January 23, 2025

కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

దండేపల్లి : దండేపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు. దండేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులను మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధ్ది చెందాయని అన్నారు. పల్లెలను అభివృద్ధ్ది చేయడానికే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమానికి అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించిం దన్నారు. గూడెం, మామిడిపల్లి, తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలను నిర్హించారు. ర్యాలీలు నిర్వహించి గ్రామ పంచాయ తీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగరవేశారు.

ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ గురువయ్య,సహకార సంఘం అ ధ్యక్షులు కాసనగొట్టు లింగన్న, వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేషం, నా యకులు బొలిశెట్టి సత్యం, గడిపెల్లి సత్యం, అల్లం సంతోష్, బొలిశెట్టి రమేష్, భూమన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News