Thursday, January 23, 2025

పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

ఖానాపూర్ : పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాంనాయక్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలో భాగంగా గురువారం బాధన్‌కుర్తి గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇటీవల ఆ గ్రామానికి రూ. కోటి 20 లక్షలతో మంజూరైనా బీటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు పల్లెలు ఏ విధంగా ఉండే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత ఎలా ఉన్నాయని తేడాలను వివరిస్తూ ఆ గ్రామంలో జరిగిన అభివృద్ది గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాడిసెపు శ్రీనివాస్, ఎంపిటిసి శనిగారపు రాణి, ఎంపీపీ అబ్దుల్ మోహిద్, ఉప సర్పంచ్ నవీన్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఎఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ఆకుల వెంకాగౌడ్, ఎంపిడిఓ బాలే మల్లేష్, ఎంపిఓ చంద్ర శేఖర్, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News