Monday, December 23, 2024

జీపీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

జనగామటౌన్ : జనగామ మండలంలోని అడవికేశ్వాపూర్, పెద్దతండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బుధవారం ప్రారంభించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అదనపు డయాలసిస్ బెడ్లను, పట్టణంలోని చెన్నకేశవస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన బస్తీ దావఖానను ఆయన ప్రారంభించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్‌పర్సన్ పోకల జమున, డీఎంహెచ్‌వో ప్రశాంత్, కౌన్సిలర్లు ఉడుగుల శ్రీలత, మహంకాళి హరిశ్చంద్రగుప్త, ప్రేమలతారెడ్డి, జీపీ భవనాల ప్రారంభోత్సవంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News