Monday, December 23, 2024

పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే సానుకూలం

- Advertisement -
- Advertisement -

మెదక్: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని వారి నివాసంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండో విడత మన ఊరు మన బడి నిధులు అన్ని పాఠశాలలకు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్యేతో మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికుల నియామకం, మరుగుదొడ్ల నిర్మాణం, నైట్ వాచ్‌మెన్‌ల ఏర్పాటు చేయాలని కోరారు. పై విషయాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News