Monday, January 20, 2025

లంబాడీల జీవితాల్లో వెలుగుల కోసం కృషి చేసిన మహానీయుడు సేవాలాల్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని, కొండల ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాండాలలో నివాసం ఏర్పాటు చేయడంలో సంత్ సేవాలాల్ చేసిన పోరాట ఫలితమే అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలో గిరిజనుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్బంగా చేపట్టిన ర్యాలీలో జగ్గారెడ్డి పాల్గొని సేవాల్‌కు ప్రత్యేక పూజలు చేసి గిరిజనులతో కలిసి స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకున్నారు.

ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ లంబాడీల్లో జ్ఞాన జ్యోతి వెలిగించి గిరిజనులకు విద్య వైద్యం కోసం కృషి చేశారన్నారు. సంచార జీవితం గడుపుతున్న గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపడం కోసం ఎంతో కృషి చేశారన్నారు. భక్తి, ఆరాధనలు నింపారన్నారు. అదే విధంగా కాంగ్రెస్‌నాయకుడు ప్రముఖ సంఘ సేవకుడు సతీష్ సేవాలాల్ మహారాజ్ ర్యాలీలో పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో బిజెపి నేత శివరాజ్‌పాటిల్ బిజెపి గిరిజన మోర్చా నాయకులతో కలిసి పూజలు చేసి గిరిజన యువకులను ఉత్సాహపరిచేలా నృత్యాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News