Thursday, January 23, 2025

బచ్చగానివి.. పీసీసీ పోస్ట్ దిగితే, నీ విలువేంటీ..?: రేవంత్‌పై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

బచ్చగానివి.. పీసీసీ పోస్ట్ దిగితే, నీ విలువేంటీ.. ఎవర్నీ బండకేసి కొడతావ్
రేవంత్‌పై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండకేసి కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. మేమేమైనా పాలేర్లమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంప్ట్ అయ్యే వాడివి పిసిసి పోస్టుకు ఎలా అర్హుడయ్యావన్న జగ్గారెడ్డి పిసిసి చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించాల్సిందిగా హైకమాండ్‌కు లేఖ రాస్తానన్నారు. నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పని అన్నారు. రేవంత్ రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. వీహెచ్ వయసు ఎక్కడ..? నీ వయసు ఎక్కడ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు. నువ్వు పోరగానివి.. బండకేసి ఎవర్ని కొడతావంటూ ఆయన ప్రశ్నించారు. పిసిసి పోస్ట్ దిగి చూస్తే.. నీకేం విలువ వుంటుందని నిలదీశారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
బిజెపి డ్రామా పార్టీ అయిపోయింది
అంతకుముందు నిరుద్యోగుల ఆశలపై మోడీ నీళ్లు చల్లారని జగ్గారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో మోడీ పర్యటన నేపథ్యంలో శనివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ డ్రామా పార్టీ అయిపోయిందన్నారు. మళ్లీ భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్తామంటున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అమ్మవారి గుడికి తాను కూడా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుడిలో భజన చేస్తానంటూ జగ్గారెడ్డి తెలిపారు. అగ్నిపథ్‌లో నాలుగేళ్లే ఉద్యోగం అని చెబుతోందని ఆయన మండిపడ్డారు. బిజెపి నేతలకు జ్ఞానోదయం కలిగించమని అమ్మవారిని ప్రార్ధిస్తామని జగ్గారెడ్డి చురకలు వేశారు. అలాగే మంచి పాలన అందించేలా బీజేపీ నేతలకు బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటానని ఆయన పేర్కొన్నారు.

MLA Jagga Reddy fires on Revanth Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News