Wednesday, January 22, 2025

జగ్గారెడ్డి న్యూ లుక్…!

- Advertisement -
- Advertisement -

జగ్గారెడ్డి న్యూ లుక్…!
శ్రీవారికి తలనీలాలు సమర్పణ..
వెంట్రుకలు, గడ్డం తీసేయడంతో అసలు ఆయన జగ్దారెడ్డియేనా?
అని డౌట్ వ్యక్తం చేసిన పలువురు నెటిజన్లు..
ఇంకొందరు ఆయన ఫోటోను షేర్ చేస్తూ
‘ఇయన ఎవరో చెప్పుకోండి చూద్దాం’ అంటూ పోస్టులు
మన తెలంగాణ/హైదరాబాద్: సంగారెడ్డి ఈ పేరు వినగానే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి గుర్తొస్తాడు.! జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి, సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అన్నట్లు ఉంటది కథ..! ఆయన ఎంఎల్‌ఎగా ఉన్న లేకపోయినా స్టైల్ మాత్రం ఒక్కటే!. ఇక ఆయన పేరు వినగానే పెద్ద వెంట్రుకలు, గుబురు గడ్డమే గుర్తుకు వస్తుంది.! ఆ ఎయిర్ స్టైల్, గడ్డం, నడక తీరు కూడా అంతే గంభీరంగా ఉంటాయి. మాట తీరు కూడా పక్కా లోకల్ అండ్ మాస్..! ప్రత్యర్థి పార్టీలనే కాదు, పలు అంశాల్లో సొంత పార్టీ నేతలను కూడా కడిగిపారేస్తారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా పేరున్న జగ్గారెడ్డికి సంబంధించిన తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత జగ్గారెడ్డిని చూసిన వారు గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడింది. తిరువీధుల్లో ఆయన తిరుగుతున్న ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వెంట్రుకలు, గడ్డం తీసియేడంతో అసలు ఆయన జగ్గారెడ్డియేనా? అని డౌట్ పడుతున్నారు. ఇంకొందరూ ఫొటోను షేర్ చేస్తూ ఇయన ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ పొస్టులు కూడా పెడుతున్నారు. ఇక జగ్గారెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి ఎంఎల్‌ఎగా ఉన్నారు.

ఇక ఆయనకు దైవభక్తి ఎక్కువే. పూజల్లో కూడా బాగా పాల్గొంటారు. ఇక వినాయక చవితి, దేవి నవరాత్రుల వస్తే భారీగా చందాలు రాస్తుంటారు. ఇక దసరా వస్తే సంగారెడ్డిలో జగ్గారెడ్డిది పెద్ద సందడే ఉంటుంది. గతంలో పలుసార్లు తిరుమలకు పాదయాత్రకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాహుల్ గాంధీ జోడో యాత్ర సంగారెడ్డిలో కొనసాగింది. ఏర్పాట్లన్నీ జగ్గారెడ్డి దగ్గర ఉండి చూశారు. ఈ సందర్భంగా రాహుల్ తో కలిసి సంప్రాదాయ నృత్యాలను కూడా అదరగొట్టేశారు. ఈ వీడియోలు తెగ వైరల్ అయిన సంగతి విదితమే.

MLA Jagga Reddy New Look goes viral

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News