Monday, January 20, 2025

ఏకే 47 కేసులో ఎమ్‌ఎల్‌ఎకు పదేళ్లు జైలుశిక్ష

- Advertisement -
- Advertisement -

MLA jailed for 10 years in AK47 case

పాట్నా : ఆర్జేడీ ఎమ్‌ఎల్‌ఎ అనంత్ సింగ్‌కు పదేళ్లు జైలు శిక్ష పడింది. అక్రమ రీతిలో ఏకే 47 గన్ కలిగి ఉన్న కేసులో జూన్ 14న ఎమ్‌ఎల్‌ఎను కోర్టు దోషిగా తేల్చింది. 2019 ఆగస్టులో ఎమ్‌ఎల్‌ఎ అనంత్‌సింగ్ ఇంటి నుంచి ఏకే 47గన్‌ను సీజ్ చేశారు. దాంతోపాటు క్యాట్రిడ్జ్‌లు, గ్రేనేడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంటి నుంచి గన్‌లను స్వాధీనం చేసుకున్న తరువాత ఎమ్‌ఎల్‌ఎ పరారీ అయ్యారు. ఆ తరువాత న్యూఢిల్లీ పోలీసులకు లొంగిపోయారు. స్పెషల్ జడ్జి త్రిలోకి దూబే మంగళవారం తీర్పును వెలువరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News