Wednesday, January 22, 2025

పల్లె ప్రగతికి తెలంగాణ సర్కార్ పట్టం

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ
బెక్కెరలో గ్రామ పంచాయతి భవనానికి భూమి పూజ
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
కల్వకుర్తి: ముఖ్యమంత్రి కెసిఆర్ సారధ్యంలో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ వచ్చిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి మండలంలోని బెక్కెర గ్రామంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పల్లె ప్రగతిలో భాగంగా 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతి భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పంచాయతి సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి పారిశుద్ధ సిబ్బందిని అభినందించారు. గ్రామ పంచాయతి భవన నిర్మాణానికి స్థల దాత జంగిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె ప్రగతికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి స్థానిక సంస్థల ప్రగతికి పట్టం కట్టారని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాలకు మౌళిక సదుపాయాలు మహత్తరంగా అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల పారిశుద్ధ పనులలో గ్రామ పంచాయతీ సిబ్బంది శ్రమ వెలకట్టలేనిదని ఆయన అన్నారు. అనంతరం నూతన గ్రామ సచివాలయం నిర్మాణ పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల డివిజన్ స్థాయి అధికారులు, జెడ్పి వైస్ చైర్మెన్ బాలాజి సింగ్, మార్కెట్ చైర్మెన్ విజయ్ గౌడ్, ఎంపిపి మనోహర, వైస్ ఎంపిపి గోవర్ధన్, సర్పంచ్ పాండు రంగారెడ్డి, మండల, గ్రామాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News