Wednesday, January 22, 2025

త్వరలో రూ.15 కోట్లతో కల్వకుర్తిలో నూతన 100 పడకల ఆసుపత్రి..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కల్వకుర్తి రూరల్: గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి ఆరోగ్య తెలంగాణ చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో 53 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ విద్యుత్ సిస్టంను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణం హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, కల్వకుర్తిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు త్వరలో జరగనుందని అన్నారు. కల్వకుర్తి కమ్యూనిటీలోని ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రి, మార్చురీ నిర్మాణం కోసం సంబంధిత శాఖ మంత్రి హరీష్ రావుకు ఆమోదం కోసం పంపామని అన్నారు. అనుమతి రాగానే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. రూ.15 కోట్లతో కల్వకుర్తిలో నూతన 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేస్తామని అన్నారు.

రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోయిన ప్రహారీ నిర్మాణాన్ని రూ.12 లక్షలతో చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే 65 లక్షలతో ఆక్సిజన్ ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. 6 లక్షలతో యోగా సెంటర్, 5 పడకల డయాలసిస్ సెంటర్‌ను, 4 లక్షలతో రక్తనిధిని త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాస్పిటల్‌లో 35 లక్షలతో అంతర్గత సిసి రోడ్డు, ట్రామా కేర్ సెంటర్ ప్రారంభం కానుందన్నారు. ట్రామా కేర్ సెంటర్ వల్ల అదనంగా 100 మంది సిబ్బంది రానున్నారని అన్నారు. 1720 కోట్లతో హైదారబాద్ నుంచి దిండి వరకు నాలుగు లైన్‌ల రోడ్డు మంజూరైందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని పలు వార్డులలో తిరుగతూ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

MLA Jaipal Yadav inaugurates Underground Power System

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News