Wednesday, January 22, 2025

దేశం చూపు సిఎం కెసిఆర్ వైపు: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

MLA Jeevan Reddy about CM KCR's Federal Front

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షమ, అభివృద్ది పథకాలతో దేశం మొత్తం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వైపు చూస్తోందని, ఆర్మూరు ఎమ్యేల్యే జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ. చెప్పులు మోసే బండి సంజయ్‌పాత్రలో పసలేదని, అభివృద్దే లక్షంగా పని చేస్తున్న తమ ప్రభుత్వంపై రాజకీయాలు చేయడమే లక్షంగా బిజెపీ పెట్టకుందని ఆయన విమర్శించారు. పంటల తెలంగాణను మంటల తెలంగాణ మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పాద యాత్ర ఎందుకు చేస్తున్నారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. మరో సారి కేసిఆర్ గెలవాలి, రావాలి అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం బండి సంజయ్ ప్రధాని చెప్పులు మోయాలన్నారు.

MLA Jeevan Reddy about CM KCR’s Federal Front

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News