Thursday, January 23, 2025

ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బిజెపిలకు వణుకు: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -
తెలంగాణ జాతిపిత అభివృద్ధి ప్రదాత
జనం మెచ్చిన నేత కెసిఆర్
ఎదురు, బెదురేలేని ఉక్కు నేత కెసిఆర్
ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బిజెపిలకు వణుకు
మళ్ళీ మళ్లీ విజయం టిఆర్‌ఎస్‌దే
పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్: ఉద్యమనేతగా స్వరాష్ట్రాన్ని సాధించి ఆరు దశాబ్దాల కలనుసాకారం చేసిన తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రిగా రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాన కెసిఆర్ అని పీయూసీ చైర్మర్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అభివర్ణించారు. సకల జనం మెచ్చిన నేత కెసిఆర్, రాజకీయంగా ఎదరు బెదురేలేని ఉక్కు నేత కెసిఆర్. ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బిజెపిలకు వణుకు పుడుతుంది. ఆయన సంస్కారం ముందు ప్రత్యర్థులు తలదించుకుంటారు. ప్రజలంతా కెసిఆర్‌కి వెన్నుదన్నుగా ఉన్నారు.

మళ్లీ మళ్లీ విజయం టిఆర్‌ఎస్‌దే. ఈసారి ఎన్నికల్లో ముచ్చగా మూడోసారి విజయం సాధించి కెసిఆర్ చర్రిత సృష్టించడం ఖాయమన్నారు. కెసిఆర్‌కాకుండా ఏ పార్టీ వచ్చిన ఉచిత పథకాలకు డప్పు పాతర వేస్తారు. పేద వర్గాల నోట్లో మట్టి కొడతారు. ఎనిమిదేళ్ల తరువాత తెలంగాణ ద్రోహులు ఎంట్రీ ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్, బిజెపిల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వరాష్ట్రమైన తరువాత దేశమే విస్తుపోయేలా తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్నది. ప్రతి ఇంట్లో సంక్షేమ వెలుగులు ప్రపరిస్తున్నాయని ఆయన పేర్కొన్నరు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ… పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికి పాలనతో ప్రతి పల్లెకూ అభివృద్ధి ఫలాలు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. నేడు యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తున్నది కెసిఆర్ వంటి ప్రగతి శీలక ముఖ్యమంత్రి దేశంలోనే లేరన్నారు. అధికారానికి మానవీయతను జోడించి ఆయన పాలన సాగిస్తున్నారని జీవన్‌రెడ్డి చెప్పారు. ఈకార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నందిపేట మండలాధ్యక్షులు మచ్చర్ల సాగర్, జడ్పీటిసి సభ్యుడు ఎర్రం యమునా ముత్యం, ఉప సర్పంచ్ కొత్తూర్ భరత్, ఎంపిటిసి సభ్యుడు మురళి, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉస్సేన్, టిఆర్‌ఎస్ నాయకులు మన్నె సాగర్, గాజుల శంకర్, మన్నె శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News