Friday, November 15, 2024

ఎంపి అర్వింద్‌ను త్వరలో నిజామాబాద్ ప్రజలే తరిమికొడతారు

- Advertisement -
- Advertisement -

రైతులను మోసం చేసిన ఆయనకు మంత్రి కెటిఆర్‌ను విమర్శించే అర్హత లేదు
బిజెపి హయంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే మోడీ ప్రభుత్వానికి తెలుసు
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పియుసి చైర్మన్ జీవన్‌రెడ్డి

MLA Jeevan reddy comments on MP Dharmapuri

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌ను త్వరలోనే నిజామాబాద్ ప్రజలే తరిమికొట్టనున్నారని యుపిసి చైర్మన్, ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయనను రైతులను మోసం చేశారని మండిపడ్డారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపుబోర్డు తీసుకొస్తామని హామి ఇచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా…ఇంత వరకు అతీగతీ లేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. పసుపుబోర్డును తీసుకొచ్చే సత్తా లేని ఆయనకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ను విర్శించే స్థాయి లేదు…అర్హత అంత కంటే లేదన్నారు.

శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం అసెంబ్లీకు ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కరోనా కారణంగా రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తామన్నారు. ప్రజల సంక్షేమంపై టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శమని వ్యాఖ్యానించారు. ఖజానాపై ఎంత భారంపడినా ఫరావలేదుకానీ, వివిధ వర్గాలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి కోతపడొద్దని సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అందుకే దేశంలోని పలు రాష్ట్రంలో కరోనా కారణంగా పలు సంక్షేమ కార్యక్రమాలను తాత్కాలికంగా పక్కనపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఏ ఒక్క దానిని కూడా నిలిపివేయని ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాన్ బిజెపి రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా శీతకన్ను వేసిందని ఆయన మండిపడ్డారు. కేంద్రంగా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న వాటినే తొలగించేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. పైగా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తోందని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

ఇందులో భాగంగా ఎపిలో ఉక్కుపరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై మంత్రి కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నారన్నారు. దీనికి కెటిఆర్‌ను అర్వింద్ దూషించడం పట్ల జీవన్ రెడ్డి మండిపడ్డారు. కెటిఆర్‌ను ఉద్దేశించి అర్వింద్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తండ్రికి గౌరవం ఇవ్వలేని సంస్కార హీనుడు అర్వింద్, కెటిఆర్‌ను విమర్శించే స్థాయి ఉందా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా అర్వింద్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News