Sunday, December 22, 2024

కుమారస్వామికి స్వాగతం పలికిన ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్ : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో చేరుకోగా ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో ఆర్మూర్ ఎంఎల్‌ఏ, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, పియుసి ఛైర్మన్ జీవన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.

శుక్రవారం సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో నిర్వహించే బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకుగాను సిఎం ఆహ్వానం మేరకు ప్రత్యేక విమానంలో వచ్చిన కుమారస్వామికి ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డితోపాటు, చెన్నూర్ ఎంఎల్‌ఏ, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌లు శాలువ, బొకేలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం కుమారస్వామి వెంట వచ్చిన పలువురు కర్ణాటక రాష్ట్ర నేతలు బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ భవన్‌కు తరలివెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News