Saturday, January 11, 2025

కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో అన్ని పార్టీలో రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, లేకపోతే రేవంత్ ఆత్మహత్య చేసుకుంటారా? అని జోగురామన్న సవాల్ విసిరారు.

Also Read:  తమిళనాడు బిజెపి కార్యదర్శి అరెస్టు..15 రోజుల రిమాండ్

బడుగు, బలహీన వర్గానికి చెందిన తనపై రేవంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని  మండిపడ్డారు. రేవంత్ ఒంటెద్దు పోకడలతో విర్రవీగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, మంత్రి కెటి రామారావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాల్లో వేగంగా దూసుకుపోతోందని రామన్న అన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ నేతలతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశం అవుతూ వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News