Monday, December 23, 2024

బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎంఎల్ఎ జోగు రామన్న

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి వార్డులలో మౌనిక వసతులతో ఆరోగ్య సంరక్షణకు మరిగైన వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. అందులో భాగంగానే..ఆదిలాబాద్ మున్సిపల్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 4 అనుకుంటాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో కలిసి ప్రారంభించారు. హాస్పిటల్లో కల్పించిన వసతులను ఎమ్మెల్యే నేరుగా పరిశీలించారు. అలాగే అక్కడి వైద్య సదుపాయాలను పరిశీలించి డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు లో ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం కోసం తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు.

ప్రజలకు అందుబాటులోనే వైద్య సేవలు అందిస్తూ గ్రామీణ పట్టణ ప్రాంతాలలో బస్తీ దవఖానాలతో పాటు ప్రాథమిక వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. గత పాలకుల హయాంలో వైద్యం అందక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అప్పుల పాలవుతూ అవుతూ వైద్యం అందించుకునే పరిస్థితిని కల్పించారాని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇకాలాంటి పరిస్థితులు ఉండబోవని. జనసాంద్రత గల ప్రదేశాలలో అందుబాటులోనే వైద్యం అందించేలా బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. స్థానిక ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి , వైస్ చైర్మన్ జెహిర్ రంజాని, పట్టణ అధ్యక్షులు అజయ్, సీనియర్ నాయకులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News