Monday, December 23, 2024

పట్టణ ప్రగతిపై ఎమ్మెల్యే జోగు రామన్న సమీక్ష

- Advertisement -
- Advertisement -

 

ఆదిలాబాద్: పురపాలక పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్థి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న ఆదేశించారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో మున్సిపాలిటీ ఆర్ అండ్ బి శాఖ ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంధర్, అధికారులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటి వరకు పూర్తి అయిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఈ ప్రేమేంధర్‌రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ, ఈఈ , డిఈలతో పాటు మున్సిపల్ కమీషనర్ శైలజ, ఇంజనీరింగ్ అధికారులు అరుణ్, తిరుపతి,యూనుస్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News