Thursday, December 26, 2024

మహారాష్ట్రలో ఎంఎల్ఎ జోగురామన్న ప్రచారం

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: జాతీయ పార్టీగా ఎదిగిన బిఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. మహారాష్ట్ర పై పార్టీ అధిష్టానం సైతం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో…జనవరి ఫస్ట్ వీక్ ముఖ్యమంత్రి కెసిఆర్ నాందేడ్ లో పర్యటించనున్నారు. జిల్లా నాయకులు మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటిస్తూ అక్కడి నేతలు, ప్రజలను కలిసి తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును వివరిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఎంఎల్ఎ జోగు రామన్న మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గంలో పర్యటించి స్థానిక నేతలతో సమావేశమయ్యారు. రాజురా స్వతంత్ర భారత పక్ష పార్టీకి చెందిన మాజీ ఎంఎల్ఎ వామన్ రావు శతప్ మూడుసార్లు ఎంఎల్ఎగా రాణిస్తూ..శత్కరి సంఘటన ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కలిసి పలు అంశాలపై చర్చించారు.

సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాచరణ, ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయన వెంట డిసిసిబి, గ్రంథాలయ చైర్మన్లు అడ్డి భోజరెడ్డి, రౌత్ మనోహర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ జోగు రామన్న మాట్లాడుతూ..బిఆర్‌ఎస్ పార్టీని మహారాష్ట్రలో సంస్థాగతంగా బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. జాతీయ పార్టీగా మారిన బిఆర్‌ఎస్ కు మహారాష్ట్రలో మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. రాజురా మాజీ ఎంఎల్ఎ వామన్ రావు శతప్ మాట్లాడుతూ..తెలంగాణలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న బిఆర్‌ఎస్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. చిన్న రాష్ట్రంగా ప్రస్థానం ప్రారంభించి..దేశంలోనే అత్యుత్తమ రాష్టాల్లో ఒకటిగా తెలంగాణ ఎదగడం స్పూర్తిదాయకమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News