Monday, January 20, 2025

అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: శంకరపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికే తలమానికంగా నిర్మాణం చేపట్టి హరిహర సుతుడు మణికంఠుడు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా వైభవంగా పూర్తి చేసిన ఆలయ కమిటీ వారిని ఆయన అభినందించారు.

ఆలయాలు మానసిక ఉల్లాసానికి కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఆలయ విశిష్టతలు దశ దిశలా వ్యాపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ పుష్కర కాలం నుండి మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఉత్సాహపరిచి చేపట్టిన ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసేందుకు సహకరించిన అందరికీ మనసా వాచా కృతజ్ఞతలు తెలుపుతున్నామని మీ సహకారం ఎల్లప్పుడూ అన్నివేళలా ఉండాలని ఆలయ కమిటీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతోపాటు ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి మాలధారులు, గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News