Friday, November 22, 2024

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంఎల్‌ఎ కంచర్ల

- Advertisement -
- Advertisement -

MLA Kancharla opened grain buying center

మనతెలంగాణ/ మాడుగుల పల్లి: నల్లగొండ జిల్లా మాడుగుల పల్లి మండల కేంద్రంలో సోమవారం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం తిప్పర్తి సహకారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రతి రైతు ధాన్యం తీసుకువచ్చి కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని ఎంఎల్ఎ కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. అదేవిదంగా తేమ 17% ఉండేవిదంగా ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని , ప్రతి ఒక రైతు భూమి పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జీరాక్స్ తప్పని సరిగా వెంట తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ రకం 1960రూపాయలు, సాధారణ రకం 1940 రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి పిఎసిఎస్ చైర్మన్ పాశం సంపత్‌రెడ్డి, వైస్ చైర్మన్ కందుల రేణుక లక్ష్మయ్య, ఎంపిపి గౌరవ సలహాదారు పోకల రాజు , మండల పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, సర్పంచ్ తూనం శోభ, టిఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సిద్దార్థరెడ్డి, మధుసూదన్, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News