Sunday, December 22, 2024

కారులో వస్తేనే లోపలికి అనుమతిస్తారా..?

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆటోలో వస్తే అసెంబ్లీ లోపలికి అనుమతించరా? కారులో వస్తేనే లోపలికి అనుమతిస్తారా? బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీకి ఆటోలో వచ్చి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని ఆరోపణలు గుప్పించారు. ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకొని, ఆటోలు కాలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇస్తానన్న 12 వేల రూపాయల ఆర్థిక సాయం తక్షణమే విడుదల చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News