Friday, November 15, 2024

స్కిల్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కొనింటి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కోహీర్: మండల పరిధిలోని ఖానాపూర్‌లో రూ.10లక్షల డిఎంటిఎఫ్, రూ.2.50లక్షల జడ్‌పి నిధులలతో నిర్మించిన నైపుణ్య కేంద్ర భవనాన్నిగురువారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు గ్రామ సర్పంచ్‌తోకలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు, అమ్మాయిల కోసం నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తూ ఆదుకుంటుందన్నారు. అలాగే ఈశిక్షణ నైపుణ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో దశాబ్ది ఉత్సవాల ఇంచార్జి జయదేవ్ ఆర్య, ఎంపిడిఓ సుజాతనాయక్, పంచాయతీ రాజ్ మండల అసిస్టెంట్ ఇంజనీర్ కోటేశ్వర్‌రావు, సూపరింటెండెంట్ సీనియర్ అసిస్టెంట్ రఘు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జంగిలి రవికిరణ్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నర్సింలు యాదవ్, ఎంపిటిసి లావణ్య, సీనియర్ నాయకులు కొత్తకాపు గోవర్దన్ రెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రామక్రిష్ణారెడ్డి, ఇజ్రాయిల్ బాబి, కొనింటి మిథున్ రాజ్, ఇర్మియా బాలు, సర్పంచ్ రమేష్, వార్డుసభ్యులు అశోక్ కుమార్, ఖానాపూర్ సొసైటీ డైరెక్టర్ రాములు, నాయకులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News