Friday, December 20, 2024

సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎంఎల్‌ఎ ల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పారదర్శకం గా లేదని వ్యాఖ్యానించింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీ వెలువడింది. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసు దర్యాప్తు బాధ్యతలను సిబిఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రతి బుధవారం అందుబాటులోకి వచ్చిం ది. దీంతో హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు కాపీలోని పలు కీలక అంశాలు వెలుగులోకి వ చ్చాయి. ఆ కాపీ ప్రకారం.. సా క్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని వ్యాఖ్యానించారు. దర్యాప్తు స మాచారం  సిఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకు, ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక అధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేశారు.

దర్యాప్తు ఆధారాలను బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20,21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చన్నారు. కోర్టు ఆర్డర్‌లో సిట్ ఉనికిని ప్రశ్నించారు. కోర్టుకి సమర్పించాల్సిన డాక్యుమెంట్స్‌ని బహిర్గతం చేశారని 26 కేసుల జడ్జిమెంట్లను కోట్ చేస్తూ తీర్పు ఇచ్చారు. అలాగే మాజీ ప్రధాని పిపి నరసింహారావు కేసును ప్రస్తావించారు. సిబిఐకి ఇవ్వడానికి 45 అంశాలను చూపిస్తూ 98 పేజీలతో తీర్పు వెలువరించారు. ‘దర్యాప్తు బాధ్యతను సిబిఐకి అప్పగించాలంటూ బిజెపి దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదు. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి ఎఫ్‌ఐఆర్ 455/2022 సిబిఐకి బదిలీ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, దర్యాప్తును సిబిఐకి అప్పగించాలంటూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు సతీష్ శర్మ అలియాస్ రామచంద్రభారతి, కోరె నందకుమార్ అలియాస్ నందు, సింహయాజులు స్వామీజీ, న్యాయవాది భూసారపు శ్రీనివాస్, కేరళకు చెందిన తుషార్ వెల్లపల్లిలు వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిపై సుదీర్ఘ వాదనలను విన్న జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం తీర్పు వెలువరించగా, తీర్పు ప్రతులు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News