Friday, November 22, 2024

క్రైస్తవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి : కొప్పుల

- Advertisement -
- Advertisement -

పరిగి: క్రైస్తవుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని పరిగి ఎంఎల్ఎ కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. క్రిస్‌మస్ పండుగను పరిగి పట్టణంలోని వివిధ చర్చిలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎ తుంకుల్‌గడ్డ చర్చిలో పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అన్ని పండుగలను, అన్ని మతాలను గౌరవిస్తుందని చెప్పారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిందని తెలిపారు. క్రైస్తవులకు ప్రతి ఏటా క్రిస్‌మస్ దుస్తులను పేద కటుంబాలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అన్ని చర్చిలలో ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహిస్తుందని అన్నారు.

శాంతి కరుణ, సహానం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన ఏసు క్రీస్తు బోధనలు విశ్వ మానవ సహోదరత్వానికి దోహాదపడుతాయని వివరించారు.అనంతరం తుంకుల్ గడ్డ చర్చి అభివృద్దికి రూ. 5 లక్షల ప్రోసిడింగ్‌ను ఫాస్టరుకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్, ఎంపిపి కరణం అరవింద్‌రావు, మార్కెట్ కమిటి ఛైర్మన్ సురేందర్, ఏఎంసీ ఛైర్మన్ శాంసుందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ భాస్కర్, సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, రాఘవపూర్ సర్పంచ్ నల్క జగన్, సయ్యద్‌పల్లి సర్పంచ్ వెంకట్రామ్‌కిష్టారెడ్డి, గణేష్‌నాయక్, రైతు సమితి అధ్యక్షుడు రాజేందర్, డైరెక్టర్ హన్మంత్‌రెడ్డి, కౌన్సిలర్‌లు, రవి, ఫాస్టర్లు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News