- Advertisement -
అమరావతి: వైసిపి పార్టీ తనని సస్పెన్షన్ చేసిన సందర్భంగా తాను స్వేచ్ఛగా అభిప్రయాలు చెప్పే అవకాశం ఉందని ఎంఎల్‌ఎ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అమరావతి రాజధాని రైతుల 1200 రోజులు నుంచి ఉద్యమం చేస్తుండడంతో 1200వ రోజుకు చేరిన సందర్భంగా రైతులు, గ్రామస్థులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పంచుమర్తి అనురాధ, సత్యకుమార్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కోటం రెడ్డి మాట్లాడారు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో సిఎం జగన్ ప్రతిపక్షనేతగా అంగీకరించి ఇప్పుడు మాట మార్చడం అసమంజసం అని దుయ్యబట్టారు.
- Advertisement -