Tuesday, December 24, 2024

ఎపి ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

MLA Kotamreddy Sridhar Reddy has a heart attack

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రూరల్ ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు రూరల్ నియోజక వర్గ పరిధిలోని ఆమంచర్లలో శుక్రవారం నాడు ‘జగనన్న మాట -గడపగడపకూ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నాడు. ఈక్రమంలో అరుంధతీ వాడలో సహపంక్తి భోజనం చేసిన అనంతరం ఎంఎల్‌ఎ అలసటకు గురయ్యారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకొన్న కొద్ది సేపటికి కోటంరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన్ని కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డికి వైద్య చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్య సేవల కోసం చెన్నైకి రెఫర్ చేయడంతో వెంటనే చెన్నైకి తరలించారు. ఎంఎల్‌ఎ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతతకు గురైన సమాచారం అందుకొన్న మంత్రి కాకాణి వెంటనే ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించిన అనంతరం వైద్యులతో మాట్లాడారు. వైఎస్సాఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సాఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంఎల్‌ఎ ఆనం రామనారాయణరెడ్డిలు ఎంఎల్‌ఎ సోదరుడు గిరిధర్‌రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News