Monday, December 23, 2024

యాదాద్రికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ కిలో బంగారం విరాళం

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: తెలంగాణ రాష్ట్ర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆదివారం కిలో బంగారం మొక్కుబడిని మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావుతో కలిసి చెల్లించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, మేడ్చల్ నియోజకవర్గం, మల్కాజ్ గిరి నియోజకవర్గం, కూకట్‌పల్లి నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లారు. కిలో బంగారం విలువ చేసే నగదును ఆలయ అధికారులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అందించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News