Wednesday, January 22, 2025

రేవంత్ కు కెటిఆర్ ఫోబియా పట్టుకుంది.. ఎమ్మెల్యే కెపి ఎద్దేవా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సిండ్రోమ్ పట్టుకుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానంద ఎద్దేవా చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ కు కెటిఆర్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు, ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారని మండిపడ్డారు.

ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా వెళ్లి, రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని.. రేవంత్ రెడ్డి చెప్పినట్టు విని వారి చేతిలో కీలు బొమ్మలాగా మారుతున్నారని ఫైరయ్యారు. ‘జాగ్రత.. రిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదిలిపెట్టం’ అని ఎమ్మెల్యే కెపి వివేకానంద హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News