Saturday, November 2, 2024

సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకం… కెసిఆర్ కు కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

MLA Kranthi kumar thanks to CM KCR

హైదరాబాద్: సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపి పరిపాలన అనుమతులు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సంగారెడ్డి జిల్లా ఎమ్యెల్యేలు కృతజ్ఞతలు చెప్పారు.  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరిష రావు నేతృత్వంలో ఆందోల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్యెల్యే మాణిక్ రావు శుక్రవారం శాసన సభలో సిఎం కెసిఆర్ ను కలిశారు. ఎన్నో ఏండ్లుగా వివక్షకు గురైన ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు కెసిఆర్ చొరవతో సస్యశామలంగా మారుతుండడంతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కొన్ని వేల ఎకరాలు సాగు నీరు అందించే కార్యక్రమంలో భాగస్వాములవుతున్నందుకు ఎమ్యెల్యేలను కెసిఆర్ అభినందించారు.

“పనులను త్వరలోనే మొదలు పెడుదామని  మొదలు పెట్టాక తొందరగా పూర్తి అయ్యేటట్టు చూస్కోవాల్నిన బాధ్యత మీదే” అని కేసీఆర్  ఎమ్యెల్యేలను ఉద్దేశించి అన్నారు. ” హరీష్ కు ఉన్న అనుభవాన్ని వాడుకోండి ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ పనులు పూర్తి చెసుకోవాలని, దగ్గరుండి పనులు పూర్తి చేయించే బాద్యత హరీష్ దేనని” సిఎం కెసిఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పిన అనంతరం ఆందోల్ ప్రజల చిరకాల స్వప్నం సాగునీటిని అందించడంలో నీవు భాగస్వామ్యమై నందుకు ధన్యుడవని, ఆందోల్ ప్రజల ఆదరణ ఎల్లకాలం నీకు వుంటుంది” అంటూ  ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ భుజాన్ని కెసిఆర్ తట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News