Thursday, December 19, 2024

కెటిఆర్ నయా లుక్ అదుర్స్..!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హెయిర్ స్టయిల్ ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన కొత్త స్టయిల్‌లో దర్శనమిచ్చారు. జుట్టు, గడ్డం పెంచుకుని కొత్త లుక్‌లో సూపర్ హీరోలా కనిపిస్తున్నారు. ఈ కొత్త లుక్‌లో ఉన్న ఫొటోను కెటిఆరే స్వయంగా ట్వీట్ చేశారు. అయితే, అది ఆయన ఒరిజినల్ ఫొటో కాదు. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ వీరాభిమాని కెటిఆర్ ఫొటోను పొడవాటి జుట్టు, గడ్డంతో ఎడిట్ చేసి ఆయనకే పంపించాడట. ఆ ఫొటో బాగా నచ్చడంతో కెటిఆర్ దానిని తన అధికారిక ఎక్స్(X) ఖాతాలో షేర్ చేశారు.

‘బీఆర్‌ఎస్ పార్టీని అమితంగా ప్రేమించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపిన నా ఫొటోను ట్వీట్ చేస్తున్నా’ అనే క్యాప్షన్ ఇస్తూ కెటిఆర్ ఆ ఫొటోను షేర్ చేశారు. దాని కింద ‘నా జుట్టు, గడ్డం నేనే ఇలా పెంచుకున్నా’ అని ఓ లైన్ రాశారు. దానికి నవ్వుతున్న ఎమోజీని ఆడ్ చేశారు. కెటిఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అభిమాని ఎడిట్ చేసిన పంపిన ఫొటోలో కెటిఆర్ లుక్ అదిరింది. దాని కింద ‘కెటిఆర్’ అని ఇంగ్లిష్‌లో పెద్ద అక్షరాలతో రాశారు. పేరు కింద ‘ది కమ్ బ్యాక్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దేన్ ది సెట్ బ్యాక్’ అనే కొటేషన్‌ను జతచేశారు. ఫొటో పైభాగంలో ఎడమ పక్కన ‘Pink Ants Team USA’ అని ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News