Monday, December 23, 2024

గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబడుతున్నాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

గవర్నర్ ప్రసంగం పూర్తి అసత్యంగా, తప్పుల తడకగా ఉందని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా తప్పుబడుతున్నామన్నారు. గత కాంగ్రెస్ హయాంలో పాలనను ప్రజలు చూశారని.. వారి పాలనలో జరిగిన అన్యాయాలను ప్రజకు వివరించామని చెప్పారు.

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇద్దామనుకున్నామని. నిర్మాణాత్మకమైన సూచనలు స్వీకరిస్తామని చెప్పారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగు నీటి సమస్య ఉండేదని.. గత కాంగ్రెస్ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని.. నల్గొండలో ఫ్లోరైడ్ గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు.బిఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే ఉంటుందని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News