Wednesday, January 22, 2025

నిర్బంధం గురించి కాంగ్రెస్ మాట్లాడటం.. పెద్ద జోక్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై శ్వేత పత్రం విడుదల చేస్తామని రాష్ట్ర మంత్రులు అంటున్నారని.. ఇప్పటికే మేము పూర్తి లెక్కలతో కూడిన డాక్యుమెంట్లను ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టామని.. కొత్తగా కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయాల్సంది ఏం లేదని సిరిసిల్ల ఎమ్మెల్యే కెటిఆర్ అన్నారు.

శనివారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కెటిఆర్ మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ ఎలా ఉండేదో అందరికీ తెలుసు. నిర్బంధం గురించి కాంగ్రెస్ మాట్లాడటం.. జోక్ లాగా ఉంది. కాంగ్రెస్ హయాంలో ముఠాలు పెంచి పోషించింది ఎవరు?. చర్చల కోసం నక్సలైట్ ను పిలిచి చంపింది ఎవరు?. పౌర హక్కుల గురించి సీతక్కకు తెలుసు. అప్పుల గురించే మాత్రమే చెబుతున్నారు.. మేము సృష్టించిన ఆస్తుల గురించి చెప్పట్లేదు. కాంగ్రెస్ మ్యాని ఫెస్టోలో పెట్టిన అన్ని హామీలను అమలు చేయండి” అని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News