Wednesday, January 22, 2025

హామీలను కార్యాచరణలో పెట్టండి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంఎల్‌ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తనకు అవకాశమిచ్చి తన విజయానికి కారణమైనందుకు సిఎంకు ఆయన కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల కు శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్ శాలువాతో సత్కరించి దీవించారు. కాగా…మునుగోడు అభ్యర్థి విజయం కోసం కృషి చేసినందుకు పార్టీ నేతలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టిఆర్‌ఎస్‌ను గెలిపించారని సిఎం పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని ఈ సందర్భంగా సిఎం సూచించారు.

సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి జగదీశ్ రెడ్డిని కెసిఆర్ ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జి. జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు పలుపురు పార్టీ నేతలు సిఎం కెసిఆర్‌ను కలిశారు. సిఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునిత, బొల్లం మల్లయ్య యాదవ్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, పైల్ల శేఖర్ రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, భాస్కర్ రావు, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎం.సి కోటిరెడ్డి, పార్టీ నేత సోమా భరత్ కుమార్, ఉమా మాధవరెడ్డి, చైర్మన్లు దూదిమెట్ల బాలరాజు, మేడె రాజీవ్ సాగర్, ఎ. సందీప్ రెడ్డి, మందాడి సైదిరెడ్డి, చాడా కిషన్ రెడ్డి, వేంరెడ్డి నర్సింహారెడ్డి, శంకర్ తదితరులున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News