Saturday, December 21, 2024

ఎంఎల్ఏ లాస్య నందిత రాజకీయ ప్రస్థానం

- Advertisement -
- Advertisement -

దివంగత నేత సాయన్న కుమారై లాస్య నందిత. 1987లో హైదరాబాద్ లో లాస్య నందిత జన్మించారు. కంప్యూటర్ సైన్స్ లో బిటెక్ పూర్తి చేశారు. 2015 లో ఎమ్మల్యే లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో లాస్య నందిత ఓడిపోయారు. 2016లో సాయన్నతో పాటు ఆమె బిఆర్ఎస్ లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్ గా పనిచేశారు. 2021 జిహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓడిపోయారు. సాయన్న మృతిచెందడంతో 2023లో ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బిజెపి అభ్యర్థి గణేశ్ పై 17 వేల ఓట్ల మెజార్టీతో లాస్య విజయం సాధించారు. తెలంగాణ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జి లాస్య నందిత శుక్రవారం పటాన్‌చెరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లోని మెటల్ క్రాష్ బారియర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News