Friday, December 20, 2024

లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత.. దురదృష్టవశాత్తు ఈసారి విధి నుంచి తప్పించుకోలేకపోయారు. సుల్తాన్‌పూర్‌ సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు కోల్పోయింది. గాంధీ ఆస్పత్రిలో లాస్య నందితకు పోస్టుమార్టం నిర్వహించగా, ఆమె శరీరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఎమ్మెల్యే లాస్య నందిత తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కాలు ఒకటి విరిగిందని, శరీరంలోని ఎముకలు విరిగిపోయాయని, ప్రత్యేకంగా తొడ ఎముక, పక్కటెముకలు విరిగిపోయాయని, ఆరు దంతాలు విరిగిపోయాయని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News