Monday, December 23, 2024

నూతన డీలక్స్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: టిఎస్ ఆర్టీసీ జహీరాబాద్ బస్ డిపోలో జహీరాబాద్ నుంచి హైదరాబాద్, బీదర్ వరకు నూతనంగా 3 డీలక్స్ బస్సు సర్వీస్‌ను సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీ నూతనంగా అందిస్తున్న డీలక్స్ బస్సు సర్వీస్ ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రజలు ఆర్టీసీ సంస్థ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సయ్యేద్ మోహిద్దీన్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ఇజ్రాయెల్ బాబీ, శివప్ప, లవాన్, ఉపేందర్, ఆర్టీసీ డిపో మేనేజర్ రజిని కృష్ణ, సిబ్బంది, డ్రైవర్‌లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News