మిడ్జిల్: రాష్ట్ర సంపాదన పెంచి బడుగు బలహీన వర్గాల పేదలకు పంచాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ పని చేస్తున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 18న సిఎం కెసిఆర్ మీటింగ్ సందర్భంగా బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు.
నీల్లు, నిధులు, నియామకాల కోసం అందరి పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చిందని, తెలంగామ వచ్చాక అభివృద్ధి ఎలా ఉందో మీరే ఆలోచించుకోవాలన్నారు. గతంలో పంటకు రెండు సార్లు మోటార్లు కొలిపోతుండే, గ్రామాల్లో తిరుగుతుంటే కాంగ్రెస్ సన్నాసులు కొందరు తాగి గొడవలు చేస్తుండ్రు, నేను జడ్చర్ల నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలు తిరిగిన ఇంత వరకు ఒక్క మనిషి కూడా అభివృద్ధి జరగలేదని నాతో అనలేదు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ముట్టింది. గ్రామాల్లో ధైర్యంగా ఓట్లను అడగండని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.
పొరపాటున వేరే గవర్నమెంట్ వస్తే అన్ని స్కీంలు బంద్ అవుతాయాని, ఆర్నెల్లకో ముఖ్యమంత్రి మారుతాడని అన్నారు. దరఖాస్తు చేసుకున్నోళ్లందరికి స్కీంలు అందుతాయని తెలిపారు. ఈ నెల 18న ఇంటికి తాలాలేసి జడ్చర్లకు తరలివచ్చి సీఎం కేసిఆర్ మీటింగ్ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, పిఏసిఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా నాయకులు బాల్‌రెడ్డి, బాలు, పాండుయాదవ్, సత్యం, గుప్తా, జంగారెడ్డి, బంగారు, భీంరాజ్, లక్ష్మణ్ పవర్ , నవీన్‌చారీ , వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.