Thursday, January 23, 2025

హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందు సాగుతుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజపేట మండలంలోని బేగంపేట,రేణికుంట గ్రామాల మధ్య ఉన్నటువంటి. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి 9 కోట్ల 50 లక్షల నిధులతో చేపట్టిన వాగుపై నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం రేణికుంట గ్రామంలోని ఎమ్మెల్యే సొంత నిధులతో నిర్మించినటువంటి పద్మశాలి భవనం ప్రారంభించారు.

అదేవిధంగా పారుపల్లి వాగుపై 12 కోట్ల 60 లక్షల నిధులతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సునీత ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా భాగంగా పలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలనే లక్ష్య ంగా సీఎం అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్,జెడ్పిటిసి చామకూర గోపాల్ గౌడ్ సర్పంచ్ బూరుగు భాగ్యమ్మ నర్సిరెడ్డి,పంబ కరుణాకర్, పిఎసిఎస్సి చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డి,మదర్స్ డైయిరీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి,ఎడ్ల బాలలక్ష్మి నాయకులు గొల్లపల్లి రాంరెడ్డి, పల్లె సంతోష్ గౌడ్,సంధిలా భాస్కర్ గౌడ్,నీరేటి బాల నరసయ్య,బేడిద వీరేశం,గుర్రం నరసింహులు,గిరిరాజు వెంకటయ్య,అధికారులు ఆర్ అండ్ బి ఈఈ శంకరయ్య,డిఈ బిలియా నాయక్, ఏఈ భరత్, నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News