శివ్వంపేట: శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలోరాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా పశు గణనాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. గేదె దూ డలు. లేగ దూడలు ప్రదర్శించారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి లేగ దూడలకు నట్టల మందు వేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మారుమూల గ్రామాల పశువులు పశువులస్పత్రి రావడానికి రైతులకు ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో రైతుల వద్దకే పశువర్ధక శాఖ వాహనం వస్తుందన్నారు.
రైతులకు అధిక పాలు ఇచ్చేందుకు ఆడదూడలు పుట్టే విధంగా మేలు జాతి పశువుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి కృషి చేస్తుందని అన్నారు. రైతులు పాడి పరిశ్రమపై ఉపాధి కోసం ప్రభు త్వం రైతులకు కృషి చేసిందని అన్నారు. ఎంపిపి హరికృష్ణ, జిల్లా జడ్పీ కో ఆ ప్షన్ సభ్యుడు మన్సూర్, సహకార సంఘం చైర్మన్ వెంకట్రాంరెడ్డి, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు ర మణ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ లక్ష్మారెడ్డి, జెడి విజయ్ శేఖర్ రెడ్డి, ఏడి వెంకటయ్య, పశుగణ అభివృద్ధి సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా డాక్టర్ రాంజీ, సూపర్వైజర్లు సత్యనారాయణ పాల్గొన్నారు.