Monday, December 23, 2024

టైలరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: మూసాపేటలో ఖార్డు సంస్థ ఆd్వర్యంలో ఏర్పాటుచేసిన టైలరింగ్ సెంటర్‌ను మంగళవారం ఎమ్మెల్యేమాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుపేదలకు తమవంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఖార్డు సంస్థ వారు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. నిరుపేదలకు నిత్యావసరాలు అందించడమే కాకుండా వారు ఆర్ధికంగా ఉన్నతి సాధించాలనే ఖార్డు సంస్థ అధినేత సుమన్‌తో చర్చించి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

అంతే కాకుండా ట్రైనింగ్ అ య్యాక తన సొంత నిధులతో ఖార్డు సంస్థతో కలిసి మహిళలకు కుట్టు మిషన్‌లను పంపిణీ చేయడం, ఉపాధి అవకాశాలు చూపించే బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు వివరించారు. తన సొంత నిధులతో 44లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. భవిష్యత్‌లో ఖార్డు సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖార్డు సంస్థ చైర్మన్ సుమన్, మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్, మల్లేష్ యా దవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News