Thursday, January 23, 2025

మూసాపేటలో ఎమ్మెల్యే మాధవరం పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట డివిజన్‌లో కొనసాగుతుంది. ఇందులో భాగంగా పీఆర్‌నగర్, అవంతినగర్, బబ్బుగూడా తదితర ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బబ్బుగూడాలోని నాలా సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు ప్రజ లు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగళహారతలు అందించారు. అదే విధంగా కొంతమంది వృద్ధ్దులు పింఛన్లకు సంబంధించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వారి వినతిని స్వీకరించి వెంటనే మంజూరు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అదే విధంగా ప్ర తి సం వత్సరం కూకట్ పల్లి ని యోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధుల కు అందిస్తున్న పుస్తకాలు,పెన్నుల బ్యాగ్ కిట్‌ను బబ్బుగూడా ప్రభుత్వ పాఠశాలలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ,ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మూసాపేట డి విజన్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నామని,ఇప్పటికే పూ ర్తి అయిన నాలుగు డివిజన్‌లో సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో సమీక్షసమావేశం నిర్వహిం చి సమస్యలు పరిష్కరిస్తున్నామని కూకట్‌పల్లి ని యోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడ మే ల క్షమని చెప్పారు.

ప్రతిని త్యం హైదరాబాద్‌లో వేలా ది మంది ప్రజలు కొత్తగా వస్తున్నారని , ఈనేపధ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్లు, ఇ తర మౌళిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తున్నట్లు వి వరించారు. సిఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ తీసుకున్న ప్రణాళికల ప్రకారంగా భవిష్యత్‌లో మంచినీరు, డ్రై నే జీ వ్యవస్థ 100 శాతం ప్రక్షాళన జరుగుతుందని, ఇం దులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఇటువం టి ముందు చూపు ఉన్న నాయకులు మనకు దొరకడం అదృష్టమని తెలిపారు. పొరపాటు వేరే పార్టీ చేతిలోపెడితే అస్తవ్యస్థమవడం ఖాయమని , దీన్ని ప్రజలు గమనించి బిఆర్‌ఎస్‌కి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూ ము శ్రావణ్, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు అంబటి శ్రీ నివాస్, సత్యనారాయణ , డిఈ శ్రేదేవి, ఇతరఅ ధికారు లు, పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News