Monday, January 20, 2025

అమ్మవారి ఆలయాల్లో ఎమ్మెల్యే మాధవరం పూజలు

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: ఆషాఢ మాస బోనాల పండగను పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోనిమూసాపేట, కూకట్‌పల్లిలో ని పలు అమ్మవారి దేవాలయాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పూజలు నిర్వహించారు. మూసాపేటలో కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబూరావు, తూము శ్రావణ్‌కుమార్, ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు మూసాపేటలోని నల్లపోచమ్మ దేవాలయం, ముత్యాలమ్మ దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించారు. తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News