Saturday, March 29, 2025

ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాధ్‌కు తీవ్ర అనారోగ్యం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాధ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని చికిత్స అందిస్తున్నారు. గత కొంతకాలంగా మాగంటి గోపీనాధ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం ఈ సమస్య మరింత పెరిగినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు.. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మాగంటి గోపీనాధ్ ఆరోగ్య పరిస్థితిని బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనేతలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకొంటున్నారు.

2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ టిడిపి టికెట్‌పై గెలుపొందారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన నాటి టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో సైతం మాగంటి గోపీనాధ్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి టిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News