Wednesday, January 15, 2025

ఎంఎల్‌ఎ మాగంటి వర్సెస్ రావుల శ్రీధర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఇరువురి మధ్య మాటల యుద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ భవన్ వేదికగా బిఆర్‌ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్, బిఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. వేదికపైనే అందరూ చూస్తుండగానే సీనియర్ నేతలు ఒకరినొకరు తిట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్ను ఎవడ్రా పిలిచింది’ అని మాగంటి గోపినాథ్ మండిపడ్డారు. ‘నిన్ను ఎవడు పిలిచిండ్రా.. నువ్వేవడివి’.. నాకు చెప్పేదంటూ రావుల శ్రీధర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ కల్పించుకుని ఇరువురు నేతలకు సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే వేదిక కింద ఉన్న బిఆర్‌ఎస్ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News