Tuesday, January 21, 2025

‘అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్’..ఈటలతో మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల సమయంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం గెలువబోతున్నారంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మేడ్చల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కండ్లకోయ కెఎస్‌ఆర్ ఫంక్షన్ హాలులో శుక్రవారం ఓ వివాహ వేడుకల్లో మల్లారెడ్డి, బిజెపి మాల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్’ అంటూ బిజెపి అభ్యర్థి ఈటల రాజెందర్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

అన్నతో ఫోటో తీయండి అని మల్లారెడ్డి అక్కడ ఉన్నవారిని కోరారు. దీంతో అక్కడున్న వారు వారి ఫోటో తీశారు. మరోవైపు ఇద్దరి నేతలతో కలిసి పలువురు ఫోటోలు దిగారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఎంఎల్‌సి కవిత బెయిల్ కోసం బిజెపి,బిఆర్‌ఎస్ ఒక్కటయ్యారంటూ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News