మంచాల:ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే తలమానికంగా తయారవుతున్నాయని బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధిలోని కొర్రవానితండా, లోయపల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ పల్లెల సమగ్ర అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి గ్రామంలో స్మశానవాటిక, ప్రకృతి వనాలు నిర్మించుకున్నామని తెలిపారు.
కుల వృత్తులను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులకు ఉత్తమ సేవా పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈకార్యక్రమంలో ఆర్డివో వెంకటాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, ఎంపిపి జాటోత్ నర్మద, వైస్ ఎంపిపి రాజేశ్వరీ, ఎంపిడివో శ్రీనివాస్, తహసీల్ధార్ అనిత, డిఈ అబ్బాస్, బిఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చీరాల రమేష్, కాట్రోత్ బహదూర్, ఆర్‌ఐ స్వేత, ఎపిఓ కొండ్రు వీరాంజనేయులు, సర్పంచ్ ఎల్లంకి అనిత, బిఆర్‌ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు వనపర్తి బద్రినాధ్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.