మన తెలంగాణ/మోత్కూరు: భువనగిరి యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో కాంగ్రెస్ నాయకురాలు ఎడ్ల పోచమ్మ మృతి చెందడంతో గురువారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పల్లపు వెంకన్న తల్లి వీరమ్మ మృతి చెందగా ఆమె భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, ఎపిఐడిసి మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరిరెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధానకార్యదర్శి రాచకొండ బాలరాజు, మాజీ సర్పంచ్ మరిపెల్లి యాదయ్య, మాజీ ఎంపిటిసి అంతటి నర్సయ్య, ఆకవరం లక్ష్మణాచారి, మాజీ ఉపసర్పంచ్ ఎడ్ల భగవంతు, నాయకులు అంతటి వెంకన్న, బద్దం యాదిరెడ్డి, గోరయ్య, సత్తిరెడ్డి, రాయప్ప, యాదగిరి, సతీష్, రవి, శ్రవణ్, మత్సగిరి, నర్సిరెడ్డి, రమేష్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.