Monday, December 23, 2024

బిజెపి కుట్రలు సాగవు: ఎమ్మెల్యే మాణిక్ రావు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి కుట్రలు సాగవని వారి మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చచ్చేంత వరకు టిఆర్‌ఎస్ లోనే కొనసాగుతానని, బిజెపిలో చేరుతారన్న ప్రచారం బూటకమన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బిజెపి కుట్రలు చేస్తుందన్నారు.

నేను ప్రజాసేవలో ఉన్నానని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తున్నానన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలో అయ్యప్ప భక్తులు నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో ఎంపీబీబీ పటేల్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలలో డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, పార్టీ నాయకులు ఎం జి రాములు, ముయుద్దీన్, నరసింహులు, ఇజ్రాయిల్ బాబి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News