Wednesday, January 22, 2025

గిరిజన దినోత్సవంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ మండ లం శేకపూర్ తండా గ్రామంలో నిర్వహించిన గిరిజన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు హాజరయ్యారు. అనంతరం సంత్ సేవలాల్ మహారాజ్‌కి పూజలు చేశారు. అనంతరం 20 లక్షల రపాయల ఎస్టీ నిధులతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్‌డిఓ జయదేవ్, ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, మాజీ ఎంపిపి విజయ్‌కుమార్, బిఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ యాదవ్, ఇప్పెపల్లి పిఎసిఎస్ చైర్మన్ దాసరి మచందర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బంగారి సురేష్, గ్రామ సర్పంచ్ లాలూబాయ్ నాగు, ఎంపిటిసి నర్సింలు, డిప్యూటీ సర్పంచ్ ప్రేమ్‌సింగ్, నాయకులు చిన్న, శ్రీకాంత్, అధికారులు, ఎంపిడిఓ, ఏఈ కోటేశ్వర్‌రావు, తహశీల్దార్, వార్డు మెంబర్లు, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News